Header Banner

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.4 వేలు! ఈ పథకం గురించి తెలుసా, దరఖాస్తు చేస్కోండి!

  Fri May 02, 2025 15:51        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో చిన్నారులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా అనాథ చిన్నారులకు నెలకు రూ.4 వేల చొప్పున అందించే మిషన్‌ వాత్సల్య పథకానికి నిధులు విడుదల చేసింది. ఈ మేరకు మిష్ వాత్సల్య కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.19.12 కోట్లు కేటాయించింది.. 2025-26 మొదటి త్రైమాసికం చెల్లింపుల కోసం ఈ నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదరణ లేని అభాగ్యులకు, అనాథ బాలలకు విద్య, వైద్య అవసరాలు తీర్చడమే వాత్సల్య పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మిషన్‌ వాత్సల్య కేంద్ర ప్రభుత్వ పథకంకాగా.. లబ్ధిదారుల ఎంపిక రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఈ పథకం నిధుల కోసం కేంద్రానికి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఈ మిషన్ వాత్యల్య పథకానికి సంబంధించి ప్రాథమికంగా దరఖాస్తుల పరిశీలన కూడా జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే జరుగుతుంది. రాష్ట్రంలో 'తల్లిదండ్రులను కోల్పోయినా.. తల్లి లేదా తండ్రి లేకున్నా, విడాకులు తీసుకున్న, కుటుంబాన్ని వదిలేసిన తల్లిదండ్రుల పిల్లలు, ప్రాణాంతక వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలకు, అక్రమ రవాణా, దాడులకు గురైన పిల్లలు అర్హులు'గా గుర్తిస్తారు.

 

ఇది కూడా చదవండి: కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.4 వేల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తుంది. ఈ పథకం కింద ఆరు నెలలకు ఒకసారి, మూడు నెలలకు ఒకసారి నిధుల్ని విడుదల చేస్తారు. ఈ పథకానికి అర్హుల విషయానికి వస్తే.. వితంతువు లేదా విడాకులు తీసుకున్న తల్లి పిల్లలు.. తల్లిదండ్రులను కోల్పోయి, ఇతరుల వద్ద నివసిస్తున్న అనాథలు.. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తల్లిదండ్రుల బిడ్డలు.. పోషించే స్థోమతలేని తల్లిదండ్రుల పిల్లలు.. బాలల న్యాయ చట్టం 2015 ప్రకారం సంరక్షణ ఆదరణ అవసరమైనవారు.. బాలకార్మికులు, బాల్యవివాహాలు, అక్రమరవాణాకు గురైనవారు.. హెచ్‌ఐవీ బాధితుల పిల్లలు, వికలాంగులు, తప్పిపోయిన లేదా పారిపోయిన, యాచక, వీధుల్లో నివసిస్తున్న, హింసకు గురైన లేదా దుర్వినియోగం చేయబడిన, దోపిడీకి గురైన చిన్నారులు.. అనాథాశ్రమాల్లో ఉంటూ మద్దతు పునరావాసం అవసరమైన పిల్లలు ఈ పథకానికి అర్హులు. అలాగే ఈ పథకం కోసం దరఖాస్తు చేసేవారి కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేలు, పట్టణ ప్రాంతాలవారికి రూ.98 వేలు మించకూడదు. తల్లికి వందనం వంటి పథకం వర్తించేవారు అనర్హులు.రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అంగన్‌వాడీ పరిధిలో కార్యకర్తలు మిషన్ వాత్సల్య పథకం గురించి విస్తృతంగా ప్రచారం చేసి.. అర్హత ఉన్న చిన్నారులను గుర్తించి నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా యాప్‌ ద్వారా సమాచారాన్ని నమోదు చేయాలని కూడా చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం గురించి తెలియని వారు చాలామంది ఉంటారని.. ఒకవేళ ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే.. వారికి ఈ పథకం గురించి చెప్పి దరఖాస్తు చేసుకునేలా చూడాలని కోరుతున్నారు.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations